హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ నాయకులు అప్పుడైనా, ఇప్పుడైనా ఢిల్లీ గల్లీల్లో మోకరిల్లడమేనని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శనివారం ట్విట్టర్ వేదికగా విమర్శించారు. బెంగళూరులో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్, కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు శివకుమార్‌తో సమావేశమైన ఫొటోను పోస్ట్ చేసి, అప్పుడు ఢిల్లీ.. ఇప్పుడు ఢిల్లీ.. కానీ ఇప్పుడు వయా బెంగళూరు అంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అంటేనే తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడం.. ఢిల్లీలో మోకరిల్లడం అంటూ మండిపడ్డారు.