హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): కేంద్రం, రాష్ర్టాల్లో అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ బీసీలను ఖాతరు చేయలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. బీసీ రిజర్వేషన్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ శాసనమండలిలో మంగళవారం ప్రవేశపెట్టిన రెండు బిల్లులపై జరిగిన చర్చలో కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలో బీసీల వెనుకబాటుకు కాంగ్రెస్సే కారణమని అన్నారు. ఇప్పటికైనా రిజర్వేషన్ల పేరిట బీసీలను మభ్యపెట్టవద్దని, పెంచిన రిజర్వేషన్లను అమలుచేసి తీరాలని డిమాండ్ చేశారు. రాజకీయ రిజర్వేషన్లకు కేంద్రం ఆమోదం అవసరమంటూ మాయమాటలు చెప్పవద్దని అన్నారు. ఒకప్పుడు మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్లను వ్యతిరేకించారని, ఇప్పుడు రాహుల్‌గాంధీ ‘మీరెంతో మీకంత వాటా’ అంటూ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్ పార్టీ ఏ ప్రాతిపదికన నిర్ణయించిందో చెప్పాలని డిమాండ్ చేశారు. డెడికేటెడ్ కమిషన్ నివేదికను ఎం దుకు బహిర్గతం చేయడం లేదని నిలదీశారు. బీసీ లెకలు తప్పుగా చెప్పడం వల్ల భవిష్యత్తు తరాలకు రిజర్వేషన్లలో, ప్రమోషన్లలో అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ బిల్లుల్లో బీసీలకు గ్రూపుల వారీగా రిజర్వేషన్లను ఎందుకు విభజించలేదని ప్రశ్నించారు. న్యాయపరమైన చికుల్లో ఈ చట్టాలు ఇరుకోవద్దన్నది తమ అభిమతమని తెలిపారు. రాష్ట్రంలో బీసీలకు ఏటా రూ.20 వేల కోట్ల మేర బడ్జెట్ కేటాయిస్తామని హామీ ఇచ్చి గత ఏడాది కేవలం రూ.9200 కోట్లను మాత్రమే కేటాయించారని దుయ్యబట్టారు. కనీసం వచ్చే బడ్జెట్లోనైనా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని అన్నారు.
విశ్వ బ్రాహ్మణులకు కార్పొరేషన్ ఉండాలి
నీరా కేఫ్‌ను కొనసాగించాలని, జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ పేరు పెట్టాలని, వడ్డెర కులాన్ని ఎస్టీల్లో చేర్చాలన్న డిమాండ్‌పై ప్రభుత్వం ఆలోచన చేయాలని, ప్రభుత్వ కాంట్రాక్టుల్లో సగర కులానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కల్పించిన రిజర్వేషన్లను కొనసాగించాలని కవిత డిమాండ్ చేశారు. విశ్వబ్రాహ్మణులకు ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పా టు చేయాలని అన్నారు. ఆరె కటిక సామాజికవర్గానికి వధశాలలకు మున్సిపల్ అనుమతులను వేగవంతం చేయాలని, పవర్ లూమ్, హ్యాండ్లూమ్ పరికరాలకు 90 శాతం సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్‌చేశారు. యాదవులు రెండో విడత గొర్రెల పంపణీ కోసం ఎదురు చూస్తున్నారని, ట్యాంక్‌బండ్‌పై దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కుర్మ సామాజిక వర్గం డిమాండ్ చేస్తున్నదని తెలిపారు. ముదిరాజ్‌లను బీసీ డీ నుంచి బీసీ ఏలో చేర్చుతామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని అమలు చేయాలని గంగపుత్రుల కోసం గతంలో చెరువుల్లో 90 కోట్ల ఉచిత చేప పిల్లలు వేస్తే, ఈ ఏడాది కేవలం 19 కోట్ల చేప పిల్లలను కూడా వేయలేదని, కుమ్మరి, నాయీబ్రాహ్మణ వంటి సామాజికవర్గాల డిమాండ్లను, సమస్యలను ప్రభుత్వం పరిషరించాలని సూచించారు.
అప్పుడు ఇచ్చి ఉంటే.. అమెరికాను మించిపోయేవారం
ఎస్సీ, ఎస్టీలతోపాటు బీసీలకు కూడా అప్పుడే రిజర్వేషన్లు కల్పించి ఉంటే అభివృద్ధిలో దేశం అమెరికాను దాటిపోయేదని ఎమ్మెల్సీ కవిత అభిప్రాయపడ్డారు. మనంతల మనమే 50 శాతం జనాభాను ఇన్ని సంవత్సరాల పాటు అవకాశాలకు దూరం పెట్టడం బాధాకరమని అన్నారు. ఉద్యోగ అవకాశాల్లో జాతీయ స్థాయిలో 27 శాతం రిజర్వేషన్లు ఉన్నా.. ఇప్పటికీ కూడా 23 శాతానికిపైగా ఖాళీలు భర్తీ కాలేదని చెప్పా రు. దేశంలో 50%ఉన్న బీసీల వద్ద కేవలం 15% మాత్రమే సంపద ఉందని, ఈ అసమానతలను సరి చేయాల్సిన అవసరం ఎం దని అన్నారు. ఇప్పటికీ అనేక బీసీ కులాలవారు దుర్భరమైన పరిస్థితులు అనుభవిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హా మీ మేరకు ఎంబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.