హైదరాబాద్, ఆగస్టు21 (నమస్తే తెలంగాణ): అభ్యర్థుల ప్రకటనతో ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ‘ఇది నిజంగా సీఎం కేసీఆర్ గారి సాహసోపేతమైన నాయకత్వం.. ప్రభావవంతమైన పాలనపై ప్రజలకు ఉన్న విశ్వాసానికి నిదర్శనం’ అని అభివర్ణించారు. ‘దమ్దార్ లీడర్.. ధమాకేదార్ నిర్ణయం’ అని వివరించారు. తెలంగాణ ప్రజలందరూ దీవించాలని కోరారు.