MLC Kavitha | వేరుశనగ రైతుల సమస్యను తక్షణమే పరిష్కరించాలి
MLC Kavitha | వేరుశనగ రైతుల(Groundnut Farmers)సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, ఆ పంటకు కనీస మద్ధతు ధర కల్పించడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్ : వేరుశనగ రైతుల(Groundnut Farmers)సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, ఆ పంటకు కనీస మద్ధతు ధర కల్పించడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) విజ్ఞప్తి చేశారు. గురువారం కౌన్సిల్లో ఈ అంశాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రత్యేకంగా ప్రస్తావించారు. సీఎం సొంత జిల్లా అయిన ఉమ్మడి మహబూబ్‌నగర్(Mahabubnagar) జిల్లాలో ఉన్న జడ్చర్ల, అచ్చంపేట, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ వ్యవసాయ మార్కెట్లలో వేరశనగ రైతులు తీవ్ర ఆందోళన చేస్తున్నారని తెలిపారు.
ఆ పంటకు క్వింటాలుకు రూ.6377 కనీస మద్ధతు ధర ఉండగా..వ్యాపారస్తులు సిండికేట్ అయ్యి రూ.5 వేలలోపు కొనుగోలు చేస్తున్నారని సభ దృష్టికి తీసుకొచ్చారు. రైతులను వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి పంటలకు కనీస మద్ధతు ధర కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు.
వేరుశనగ పంటకే కాకుండా అన్ని పంటలకు కనీస మద్ధతు ధర కంటే తక్కువ ధర ఉంటే రూ.500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిందని, కాబట్టి కనీస మద్ధతు ధర కల్పిస్తారా లేదా బోనస్ ఇస్తారా అన్న విషయంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, వేరుశనగ రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

