Home
Telangana
Mlc K Kavitha Gave Financial Assistance To Victims Who Get Eye Injuries On Diwali Day
దాతృత్వాన్ని చాటుకున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
Kalwakuntla Kavitha | తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన దాతృత్వాన్ని చాటుకున్నారు. దీపావళి సంబరాల సందర్భంగా పటాకులు కాల్చి
హైదరాబాద్ : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన దాతృత్వాన్ని చాటుకున్నారు. దీపావళి సంబరాల సందర్భంగా పటాకులు కాల్చి కంటి గాయాలపాలైన వారి కోసం ఆమె ఆర్థికసాయం చేశారు. కంటి గాయాలతో సరోజినీ దేవి కంటి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు ఆమె తన సాయం అందజేశారు. ఎమ్మెల్సీగా తనకు లభించే నెల వేతనం నుంచి కంటి గాయాలైన బాధితుల చికిత్సకు అవసరమయ్యే మొత్తాన్ని సాయంగా ఇచ్చారు.
సరోజిని దేవి ఆస్పత్రి అధికారులను కలిసిన కవిత.. పటాకులు కాల్చి కంటి గాయాలపాలైన వారి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. తాను సాయంగా ఇవ్వదల్చుకున్న మొత్తాన్ని ఆస్పత్రి వైద్యులకు అందించారు. అంతేగాక కంటి గాయాలైన బాధితులకు సాయంగా వచ్చిన అటెండెంట్లకు కూడా మూడు రోజులపాటు భోజన వసతి కల్పించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

