పరిగి, ఏప్రిల్ 7 : ఎమ్మెల్సీ గోరటి వెంకన్న పక్షి ప్రేమను చాటుకున్నారు. గోరటి నారాయణపేట జిల్లా మద్దూరు పర్యటన నుంచి సోమవారం హైదరాబాద్ తిరిగి వస్తున్న సమయంలో ఓ వేటగాడు కంజుపిట్టను పట్టుకొని వెళ్తుండగా తన వాహనం ఆపి అతడికి రూ.150 ఇచ్చి కంజుపిట్టను కొనుగోలు చేశారు. అడవిలో వదిలేద్దామని చూడగా కాలికి గాయం కనిపించింది. దీంతో వికారాబాద్ జిల్లా పరిగి మండలం గడిసింగాపూర్ పశువైద్య కేంద్రానికి కంజుపిట్టను తీసుకొని వెళ్లి వెటర్నరీ లైవ్‌స్టాక్ ఆఫీసర్ సతీష్‌కుమార్‌తో వైద్యం చేశారు. కంజుపిట్ట కోలుకున్న తర్వాత మద్దూరు సమీపంలోని అడవిలో వదిలిపెడతానని వెంకన్న తెలిపారు.