Graduate MLC Results | నల్గొండ-ఖమ్మం-వరంగల్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యింది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 1,22,813 ఓట్లు వచ్చాయి. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్ రెడ్డికి 1,04,248 ఓట్లు వచ్చాయి. ఇక బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి 43,313 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్ 29,697 ఓట్లు వచ్చాయి.
ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలవాలంటే మొదటి ప్రాధాన్యత ఓట్లలో 1,55,095 ఓట్లు రావాల్సి ఉంది. కానీ కోటా ఓట్లు ఎవరికీ రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపును చేపడుతున్నారు.