ఉద్యమాన్ని అణచివేస్తే విస్ఫోటమే
శాంతియుత ఉద్యమాన్ని అణచివేత చర్యలతో గానీ, రాజకీయ కుయుక్తులతో గానీ నొక్కేయాలని చూస్తే అది ప్రజావిస్ఫోటానికి దారితీసి, ప్రభుత్వ పునాదులనే కదిలిస్తుందని ప్రముఖ కవి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ పేర్కొన్నారు.
- ఏం చేసినా చెల్లుతుందనే అహంకారం వద్దు
- విద్యార్థి ఉద్యమానికి మద్దతుగా ఎమ్మెల్సీ దేశపతి ఫైర్
హైదరాబాద్, జూలై 23(నమస్తే తెలంగాణ) : శాంతియుత ఉద్యమాన్ని అణచివేత చర్యలతో గానీ, రాజకీయ కుయుక్తులతో గానీ నొక్కేయాలని చూస్తే అది ప్రజావిస్ఫోటానికి దారితీసి, ప్రభుత్వ పునాదులనే కదిలిస్తుందని ప్రముఖ కవి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ పేర్కొన్నారు. గురువారం ‘ఎక్స్’ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన సుదీర్ఘ లేఖ రాస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘ప్రధాని మోదీ గారూ.. మీరు ఇప్పటికైనా రాజకీయ ప్రయోజనాలకతీతంగా, విజ్ఞతతో వ్యవహరించాల్సిన ఆవశ్యకత ఉన్నది‘ అని సూచించారు. ఢిల్లీ వేదికగా దేశ యువత చేపట్టిన ఉద్యమం వెనుక ఎలాంటి రాజకీయశక్తుల ప్రమేయం లేదని, అది వారి బంగారు భవిష్యత్తు, ఆత్మగౌరవం కోసం స్వచ్ఛందంగా సాగిస్తున్న చారిత్రాత్మక సమరమని దేశపతి స్పష్టంచేశారు. యువత హృదయాల్లో రగులుతున్న తీవ్ర అసంతృప్తిని కేవలం ఒక నిరసనగా చూడకూడదని, దేశంలో సుపరిపాలన కోసం వారు వ్యక్తం చేస్తున్న ఆకాంక్షగా గుర్తించాలని ఆయన కోరారు. ప్రస్తుతం ఉద్యమిస్తున్న నిరుపేద, నిరుద్యోగ యువత తమ హకుల పట్ల పూర్తి అవగాహనతో, గాంధే య మార్గంలో శాంతియుతంగా పోరాడుతున్నారని దేశపతి కొనియాడారు. అధికారం శాశ్వతం కాదు.. అది ప్రజాస్వామ్యం ప్రసాదించిన ఒక బాధ్యత మాత్రమేనని హెచ్చరించిన దేశపతి, పాలకులు ఏం చేసి నా చెల్లుతుందనే అహంకారంతో ఉండటం మంచిది కాదని హితవు పలికారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

