హైదరాబాద్ మే 16 (నమస్తే తెలంగాణ) : ‘సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి, మంత్రులు హెచ్సీయూలో శ్రమదానం చేసి నరికిన చెట్లను తిరిగి నాటండి’ అంటూ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ చురకలంటించారు. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాశారు. సుప్రీం తీర్పుతోనైనా ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని అన్నారు.
ప్రకృతిని నాశనం చేసే సర్కారు చర్యలు.. రాక్షస స్వభావానికి నిదర్శమని ఆయన మండిపడ్డారు. పర్యావరణ విధ్వంసానికి పాల్పడుతున్న కాంగ్రెస్ సర్కారుపై పచ్చదనం కోసం పరితపిస్తున్న యువత ఆగ్రహంగా ఉన్నదని స్పష్టంచేశారు. ‘మీరు చేసిన అరాచకానికి మీరే బాధ్యులు.. మొక్కలు నాటి ఆ చేతలతో క్షమాపణలు చెప్పండి’ అని నిలదీశారు.