మండలి డిప్యూటీ చైర్మన్‌గా బండ ప్రకాశ్.. అభినందించిన సీఎం కేసీఆర్
శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌గా ఎమ్మెల్సీ బండ ప్రకాశ్ ముదిరాజ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈమేరకు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రకటించారు. బండ ప్రకాశ్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు.
హైదరాబాద్: శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌గా ఎమ్మెల్సీ బండ ప్రకాశ్ ముదిరాజ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈమేరకు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రకటించారు. బండ ప్రకాశ్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. సాదరంగా ఆహ్వానించి చైర్లో కూర్చోబెట్టారు. పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. మండలి డిప్యూటీ చైర్మన్‌గా బండ ప్రకాశ్ ఏకగ్రీవంగా ఎన్నికవడం తమకెంతో ఆనందదాయకమని చెప్పారు. మంచి విద్యాధికులుగా పేరు తెచ్చుకున్నారని వెల్లడించారు. విద్యార్థిగా ఉంటూనే రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారని తెలిపారు. కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టడం గర్వకారణమన్నారు. ఆయన సేవలు తెలంగాణ ప్రజానీకానికి ఎంతో అవసరమని చెప్పారు. డిప్యూటీ చైర్మన్‌గా సభలో ఫలవంతమైన చర్చలకు అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాని తెలిపారు.
మండలి డిప్యూటీ చైర్మెన్‌గా ఎన్నికైన బండ ప్రకాశ్‌ను మంత్రి కేటీఆర్ హృదయపూర్వకంగా అభినందించారు. ఆయన అనుభవం సభకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాన్నారు. కాగా, బండ ప్రకాశ్‌కు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్సీలు శుభాకాంక్షలు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

