హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ): సీఎం పదవి దకినా కూడా రేవంత్‌రెడ్డి ఇంకా తాను ప్రతిపక్షంలోనే ఉన్నానని భ్రమపడుతున్నారని, ఆ భావజాలం ఇంకా తగ్గలేదని కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘మన రాష్ట్ర పురోగతి కోసం ఎస్ఎల్బీసీ టన్నెల్లో 8 మంది కార్మికులు చెమటను ధారబోసేందుకు వచ్చి ప్రమాదంలో చిక్కుకుంటే.. వారి పార్థి వ దేహాలను గుర్తించలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉన్నది.
ఇది ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. టన్నెల్ ప్రమాదం జరిగినప్పుడు మాజీ మంత్రి హరీశ్‌రావు ఉద్యమ సహచరులు కొత్త ప్రభాకర్‌రెడ్డి కుమార్తె ఎంగేజ్మెంట్కు హాజరయ్యారు. తిరిగి వచ్చిన వెంటనే బీఆర్ఎస్ బృందంతో కలిసి ఘటన స్థలానికి వెళ్లారు. అక్కడి పరిస్థితులను లోతుగా పరిశీలించి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ప్ర యత్నించారు. హరీశ్ రాలేదని ప్రశ్నించడం అర్థరహితం. దీనిపై రేవంత్ ఆత్మవిమర్శ చేసుకోవాలి. విషాద స మయంలో మంత్రులు చేపలకూర వం డించుకొని తిన్నారని పేర్కొన్నారు.