మోర్తాడ్, జనవరి 21: పోలీసుల పహారా మధ్య గ్రామసభలు నిర్వహిస్తారా..? రేవంత్‌రెడ్డీ.. ఇదేనా ప్రజాపాలన అని మాజీమంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. నిజామాబాద్ జిల్లాలో మంగళవారం ప్రారంభమైన గ్రామసభల తీరుపై ప్రభుత్వాన్ని ఒక ప్రకటనలో నిలదీశారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా ఎందుకు వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు. లబ్ధిదారుల ఎంపికలో కాంగ్రెస్ నాయకులకే పెద్దపీట వేస్తున్నారంటూ జనం ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎక్కడిక్కడ నిలదీస్తున్నారని తెలిపారు.