MLA Palla Rajeshwar Reddy | గవర్నర్‌తో ముప్ఫై మోసాలు, అరవై అబద్ధాలు చెప్పించారు: ఎమ్మెల్యే పల్లా
గవర్నర్‌తో ముప్ఫై మోసాలు, అరవై అబద్ధాలు చెప్పించారని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి (MLA Palla Rajeshwar Reddy) విమర్శిచారు. గవర్నర్ ప్రసంగంలో అరచేతిలో వైకుంఠం చూపించారన్నారు. మేనిఫెస్టలోని అంశాలు గవర్నర్ ప్రసంగంలో లేవని, హామీ ఊసే లేదన్నారు.
హైదరాబాద్: గవర్నర్‌తో ముప్ఫై మోసాలు, అరవై అబద్ధాలు చెప్పించారని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి (MLA Palla Rajeshwar Reddy) విమర్శిచారు. గవర్నర్ ప్రసంగంలో అరచేతిలో వైకుంఠం చూపించారన్నారు. మేనిఫెస్టలోని అంశాలు గవర్నర్ ప్రసంగంలో లేవని, హామీ ఊసే లేదన్నారు. ప్రగతి భవన్ గతంలో కూడా ప్రజా భవనేనని స్పష్టం చేశారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడారు. గత ప్రభుత్వం ప్రగతి భవన్లో ఎన్నో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిందన్నారు. సింగరేణి కార్మికుల సమస్యలు తీర్చింది ప్రగతి భవనే అన్నారు. సీఎం రేవంత్ కనీసం వారానికి ఒక్కసారి కూడా ప్రజావాణికి హాజరుకాలేదని విమర్శించారు. ఆరు గ్యారంటీల గురించి కాంగ్రెస్ గొప్పగా చెప్పుకుంటుందని, గవర్నర్ ప్రసంగంలో కూడా అబద్ధాలు చెప్పారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఒక గ్యారంటీలో ఒక పథకాన్ని మాత్రమే అమలు చేశారన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద రూ.20 కోట్లు ఖర్చు చేస్తే రూ.60 కోట్లు ప్రచారం చేసుకున్నారని ఎద్దేశా చేశారు.
13 అంశాల్లో కేవలం రెండు మాత్రమే అమలుచేశారని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సులిచ్చారు.. బస్సుల సంఖ్య పెంచలేదు, ట్రిప్పులు పెంచలేదని విమర్శించారు. ప్రమాణ స్వీకారం రోజునే రైతు రుణమాఫీ చేస్తామన్నారు. కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీలనే అమలు చేయాలని తాము అడుగుతున్నామని చెప్పారు. ఆరున్నర లక్షల మందికిపైగా ఆటో డ్రైవర్ల జీవితాలు ప్రమాదంలో పడ్డాయన్నారు. రెండు నెలల్లో 21 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకు రూ.20 లక్షల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దక్షిణాది వారికే ఛాన్స్ ఇవ్వాలి
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

