వరంగల్ : వరంగల్ ఇన్నర్ రింగ్ రోడ్ భూనిర్వాసితులను గుండెల్లో పెట్టుకుంటామని, దశల వారీగా నష్టపరిహారం చెక్కులను అందిస్తామని టీఆర్ఎస్ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ పేర్కొన్నారు. వరంగల్ ఇన్నర్ రింగ్ రోడ్ భూనిర్వాసితుల సమస్యకు పరిష్కారం లభించింది అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ సమస్య పరిష్కారానికి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌తో పలుమార్లు చర్చించానని పేర్కొన్నారు.
భూనిర్వాసితులకు ఎట్టి పరిస్థితుల్లో కూడా నష్టం జరగనివ్వం అని సీఎం తనతో చెప్పారు. ఈ సమస్యపై కేసీఆర్ తక్షణమే స్పందించి పరిష్కరించేందుకు ఆదేశాలు ఇచ్చారని గుర్తు చేశారు. సమస్య పరిష్కారం పూర్తైంది. పరిహారం ఈ రోజు నుండి అందజేయటం జరుగుతుంది. టెక్నికల్ గా ఏదైనా సమస్య ఉన్నవారు, భూమి విషయంలో ఏదైనా సమస్య ఉన్నవారు తనను నేరుగా సంప్రదించండి.. ఏ ఒక్కరికి నష్టం జరగకుండా చూస్తానని ఎమ్మెల్యే నరేందర్ పేర్కొన్నారు.