హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): ‘వం ట నూనె, పెట్రో లు, డీజిల్ వాడకాన్ని తగ్గించాలి.. బంగారాన్ని కొనొద్దు’ అని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శించారు. సోమవారం సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ మోదీ ప్రభుత్వ పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు ప్రజలకు పొదుపు చర్యలు సూచిస్తున్నారని ఎద్దేవా చేశారు. దేశ ప్రగతిపై మోదీకి చిత్తశుద్ధి ఉంటే దేశంలోని శత కోటీశ్వరులపై 2నుంచి 6శాతం పన్ను విధిస్తే లక్షల కోట్లు సమకూరుతాయని సూచించారు. తెలంగాణ లో బీజేపీ ప్రభుత్వం రావాలన్న మోదీ కల ఎన్నటికీ నెరవేరదని చురకలంటిచా రు. రాష్ట్ర విభజన హామీలు 12ఏండ్లు అయినా నెరవేర్చని బీజేపీని తెలంగాణ ప్రజలు ఎప్పటికీ విశ్వసించరని స్పష్టంచేశారు. మావోయిస్టులను అంతమొందించటమే పరిష్కారమని మోదీ అభిప్రాయాన్ని కూనంనేని ఖండించారు.