MLA Kunamneni Sambasiva Rao | హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్సీ కవిత బెయిల్ అంశంపై రాజకీయాలు వద్దని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హితవు పలికారు. రాజకీయాలు చేయాలనుకుంటే కేసీఆర్, కేటీఆర్‌పై పోరాడాలని కాంగ్రెస్, బీజేపీ నాయకులకు సూచించారు.
హైదరాబాద్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం మగ్ధూంభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కవితపై వచ్చిన ఆరోపణలపై కోర్టునిర్ణయం తీసుకుంటుందని, కాంగ్రెస్, బీజేపీ నేతలు అర్థంలేని విమర్శలు మానుకోవాలని కూనంనేని సూచించారు. చెరువులు, ప్రభు త్వ భూములు, వక్ఫ్, దేవాదా య భూములలో కబ్జాలపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
హైడ్రా అంటే ఆక్రమణదారులకు భయం పుట్టాలని, కూల్చివేతలు చేపట్టే ముందు పేద, మధ్యతరగతి ప్రజలకు పునరావాసం కల్పించాలని కోరారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరారు.