హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): భారతీయ జీవిత బీమా (ఎల్ఐసీ) సొమ్మును అదానీకి బీజేపీ ధారాదత్తం చేస్తున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. డిసెంబర్ 26న ఖమ్మం జిల్లాలో సీపీఐ వందేళ్ల ముగింపు ఉత్సవాలు నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు.
సోమవారం పార్టీ సీనియర్ నాయకురాలు పశ్య పద్మ కలిసి రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల ఆయన మాట్లాడారు. పేదలు ఎల్ఐసీకి రూ.33వేల కోట్లు డిపాజిట్ చేస్తే, అదానీ కంపెనీలను ఆదుకోవడం కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆ సొమ్మును వాడుకుంటుందని మండిపడ్డారు. ఎల్ఐసీ సొమ్మును కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు.