ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Telangana - Sep 04, 2020 , 12:37:33

కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించిన ఎమ్మెల్యే కిశోర్ కుమార్

కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించిన ఎమ్మెల్యే కిశోర్ కుమార్

యాదాద్రిభువనగిరి : జిల్లాలోని అడ్డగూడూర్ మండలం డి.రేపాక గ్రామంలో కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో తుంగతుర్తి ఎమ్మెల్యే డా. గాదరి కిశోర్ కుమార్ క్షేత్రస్థాయిలో పర్యటించారు. గ్రామంలో కరోనా విజృభిస్తున్న సందర్భంలో వీధుల్లో తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పించారు. అధైర్యపడొద్దని అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఎప్పటికప్పుడు హైడ్రోక్లోరైడ్ ద్రావణాన్ని గ్రామంలో పిచికారీ చేయించాలని అధికారులను ఆదేశించారు. 

గ్రామంలో నిర్వహిస్తున్న వైద్య పరీక్షలు చేయించుకోవాలని ప్రజలను కోరారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో మాట్లాడారు. వైద్య సిబ్బందిని మరింత పెంచాలని సూచించారు. ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులను ధరించాలన్నారు.


 


logo