జమ్మికుంట, జూన్18: కరీంనగర్ జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రంలో మంగళవారం జరిగిన ‘కిసాన్ సమ్మాన్ నిధి’ కార్యక్రమం రసాభాసగా మారింది. ప్రధాన మంత్రి కిసాన్ స మ్మాన్ నిధి యోజన నిధుల విడుదల ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో కేవీకే సమావేశ మందిరంలో ఏ ర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా కేంద్ర జల్‌శక్తి, రైల్వే శాఖ సహాయ మంత్రి వీ సోమన్న, మరో అతిథిగా హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేసిన పథకాలను వివరించే క్రమంలో బీజేపీ నాయకులు అత్యుత్సాహం చూపారు. వీరితో కొందరు కాంగ్రెస్ నాయకులు జత కలిసిపోయారు. ఎమ్మెల్యే అతిథనే విషయాన్నే మరిచిపోయారు. ప్రొటోకాల్‌ను విస్మరించి ప్రసంగాన్ని అడ్డుకున్నారు. తెలంగాణ పథకాలతోపాటు, కిసాన్ సమ్మాన్ నిధి పథకంపై కూడా మాట్లాడుతానని చెప్పి ప్రసంగాన్ని కొనసాగించారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపారని చెప్పారు. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల విద్యుత్తు, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అందిస్తున్న సాగునీటి విషయాన్ని చెప్తున్న క్రమంలో ఒక్కసారిగా బీజేపీ నాయకులు లేచి అడ్డుకున్నారు. కేసీఆర్ పేరును ప్రస్తావించొద్దని లొల్లి చేశారు. గొడవ చేయొద్దు’ అని కేవీకే నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. పోలీసులు అడ్డుకున్నా.. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో నాయకులంతా సంయమనం పాటించాలని కేంద్రమంత్రి సోమన్న విజ్ఞప్తి చేశారు. అనంతరం మంత్రి సోమన్న మాట్లాడారు.