ఎమ్మెల్సీ తాతా మధు వ్యాఖ్యలను కాంగ్రెస్ నాయకులు కావాలనే స్పీకర్‌కు ఆపాదించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ విమర్శించారు. అసలు స్పీకర్‌ను అవమానించింది కాంగ్రెస్ నాయకులేనని, మూడేండ్లుగా ఇలాంటి డైవర్షన్ రాజకీయాలకే పరిమితమయ్యారని దుయ్యబట్టారు. అసెంబ్లీకి వెళ్తున్న తమను పోలీసులు అడ్డుకున్న తీరు అత్యంత హేయమని ఆ వేదన వ్యక్తంచేశారు.
మహిళా ప్రజాప్రతినిధులపై పోలీసులు జరిపిన దాడి సభ్యసమాజం తలదించుకొనేలా ఉన్నదని ఆగ్ర హం వెలిబుచ్చారు. డీసీపీ శిల్పవల్లి సహా పలువురు అధికారులు మహిళా ఎమ్మెల్యేల జుట్టు పట్టి లాగడం, చీరలు లాగుతూ గొంతుపిసికేలా వ్యవహరించ డం సిగ్గుచేటని విమర్శించారు. ఇలాంటి సంసారహీనమైన చర్యలకు పాల్పడిన అధికారుల ఫొటోలు తమ వద్ద ఉన్నాయని, ఎట్టి పరిస్థితుల్లోనూ వదలమని హెచ్చరించారు.