చల్లూరు గుట్టల్లో ఎమ్మెల్యే అక్రమ మైనింగ్!
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం రాజాపేట మండలంలోని చల్లూరు గుట్టలో అక్రమ మై నింగ్, స్టోన్ క్రషర్ కార్యకలాపాలు జో రుగా సాగుతున్నాయని, దీనిపై సమగ్ర ద ర్యాప్తు చేయాలని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్రెడ్డి డిమాండ్ చేశారు.
- ప్రభుత్వ భూమి ఆక్రమించి.. యథేచ్ఛగా క్రషర్ పనులు
- వెంటనే దర్యాప్తు జరిపించాలి
- మైనింగ్ మంత్రికి మాజీ ఎమ్మెల్యే సునీత ఫిర్యాదు
యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ) : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం రాజాపేట మండలంలోని చల్లూరు గుట్టలో అక్రమ మై నింగ్, స్టోన్ క్రషర్ కార్యకలాపాలు జో రుగా సాగుతున్నాయని, దీనిపై సమగ్ర ద ర్యాప్తు చేయాలని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం ఆమె మైనింగ్ శాఖ మంత్రికి ఫిర్యాదు చేశారు.
ఇందులో ఎమ్మెల్యే ప్రమేయం ఉన్నట్టు అనుమానం ఉన్నదని పేర్కొన్నారు. రాజాపేట మండలం చల్లూరులోని సర్వే నంబర్ 322లో అక్రమ మైనింగ్ నడుస్తున్నదని, గతంలోనూ ఈ దందా కొనసాగిందని తెలిపారు. క్రషర్ పనులతో స్థానికులు ఆందోళన చెందుతున్నారన్నారు. ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, వ్యాపారవేత్త జయరామిరెడ్డి పేర్లు వినిపిస్తున్నాయని చెప్పారు. క్రషర్ను మూసివేయాలని ప్రజలు ఆందోళన చేపట్టడంతో మూసివేశారని, మళ్లీ ప్రారంభించకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

