సత్తుపల్లి టౌన్, జనవరి 27 : ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే భర్త అధికారం చెలాయిస్తున్నారు. కాంగ్రెస్ తరఫున మట్టా రాగమయి ఎమ్మెల్యేగా గెలుపొందగా ఆమె భర్త దయానంద్ షాడో ఎమ్మెల్యేగా వ్యహరిస్తున్నాడంటూ ప్రజలు చర్చించుకుంటున్నారు. సత్తుపల్లిలో తాగునీటి సరఫరా కోసం అమృత్ 2.0 పథకం పనులను మున్సిపల్ అధికారులు చేపట్టారు. సోమవారం ఈ పనులకు ఎమ్మెల్యే మట్టా రాగమయి భూమిపూజ చేయాల్సి ఉండగా.. ఆమె రాకపోవడంతో రాగమయి భర్త, కాంగ్రెస్ నాయకుడు దయానంద్ చేపట్టాడు. ఈ తతంగాన్ని గమనించిన సత్తుపల్లి ప్రజలు ముక్కున వేలేసుకున్నారు.