బీసీ వ్యతిరేకి బీజేపీ.. చీఫ్ విప్ వినయ్ భాస్కర్
Dasyam Vinay Bhaskar | బీజేపీ బీసీల వ్యతిరేకి అని ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ అన్నారు. ఎనిమిదేండ్లుగా బీసీలకు బియ్యపు గింజంత మేలు కూడా చేయలేదని విమర్శించారు. ఓబీసీ అయిన ప్రధాని మోదీ
హైదరాబాద్: బీజేపీ బీసీల వ్యతిరేకి అని ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ అన్నారు. ఎనిమిదేండ్లుగా బీసీలకు బియ్యపు గింజంత మేలు కూడా చేయలేదని విమర్శించారు. ఓబీసీ అయిన ప్రధాని మోదీ తమకు ఎదో చేస్తారని దేశ వ్యాప్తంగా ఉన్న బీసీలంతా ఎనిమిదేండ్లుగా ఆశగా ఎదురుచూస్తున్నారని, అవన్నీ అడియాశలు అయ్యాయని విమర్శించారు. విగతా వర్గాలతోపాటు బీసీలకు కూడా ఏం చేయలేకపోయారని చెప్పారు. అసెంబ్లీలోని టీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, ఎమ్మెల్యే ముఠా గోపాల్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. అన్ని వర్గాల ప్రజలు మోదీపై అసంతృప్తిగా ఉన్నారని చెప్పారు. ఓబీసీ మంత్రిత్వ శాఖతోపాటు బీసీ జనగణన విషయంలో బీజేపీ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నదని వెల్లడించారు.
ఓబీసీ మంత్రిత్వ శాఖ కోసం కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఆనాడే పీఎం మన్మోహన్ సింగ్‌పై ఒత్తిడి తీసుకొచ్చారని గుర్తుచేశారు. అయితే అప్పుడు కాంగ్రెస్ పట్టించు కోలేదని, ఇపుడు బీజేపీ కూడా బీసీ సమస్యలపై స్పందించడం లేదని చెప్పారు. మరోవైపు సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేనివిధంగా బీసీలకు మేలు చేసేలా చర్యలు తీసుకున్నారని తెలిపారు. బీసీ విద్యార్థుల కోసం 300 పైగా గురుకులాలు ఏర్పాటు చేశారని వెల్లడించారు. కేంద్రంలో సీఎం కేసీఆర్ చొరవతో భవిష్యత్‌లో ఏర్పాటయ్యే ప్రభుత్వం బీసీల సంక్షేమం కోసం చర్యలు తీసుకుంటుందన్నారు.
బీజేపీకి ఓబీసీ సెల్ ఉంటుంది కానీ కేంద్రంలో ఓబీసీ మంత్రిత్వ శాఖ ఉండదా అని ప్రశ్నించారు. ఈ విషయమై బీజేపీ ఓబీసీ సెల్ అధ్యక్షుడైన ఎంపీ లక్ష్మణ్ ప్రధాని మోదీపై ఒత్తిడి చేయలేరా అని నిలదీశారు. తక్షణమే బీసీ గణన చేయాలని, ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
మోదీ పేరుకే బీసీ.. ఎమ్మెల్సీ సారయ్య
ప్రధాని మోదీ పేరుకే బీసీ అని, ఆయన నేతృత్వంలోని ప్రభుత్వం చేసేవన్నీ బీసీ వ్యతిరేకపు పనులేనని ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం బీసీల ఆత్మగౌరవాన్ని కాపాడుతుంటే.. కేంద్రం మంట గలుపుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీసీల సంక్షేమం కోసం అవసరమైతే తెలంగాణ ఉద్యమం లాంటి పోరాటం చేస్తామన్నారు. పూలే ఆలోచనా విధానాన్ని కేసీఆర్ అమలు చేస్తున్నారని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం బీసీ వ్యతిరేక విధానాలపై పోరాడుతామని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. కేసీఆర్ బీసీ అనుకూల విధానాలు కేంద్రంలో అమలు చేయాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Keerthy Suresh | కీర్తి సురేశ్ ‘సత్యవాన్ సావిత్రి’కి ఊహించని ఓపెనింగ్స్.. తొలి రోజే షాక్!
Allu Aravind | అల్లు సినిమాస్‌లో టికెట్ల బ్లాకింగ్‌పై ప్రేక్షకుల ఆగ్రహం.. వెంటనే వీడియో కాల్ చేసిన అల్లు అరవింద్,అక్కడికక్కడే కీలక నిర్ణయం!
Salman Khan | చిరంజీవి, వెంకటేశ్, రామ్ చరణ్, ఎన్టీఆర్ సినిమాల్లో ఛాన్స్ ఇస్తే రెడీ.. టాలీవుడ్ హీరోలపై సల్మాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Priyanka Arul | ఓజీ హీరోయిన్ ప్రియాంక మోహన్ సాహసం.. అంధురాలిగా కొత్త అవతారం,బర్త్‌డే పోస్టర్‌తో ఆసక్తి పెంచిన మేకర్స్!
బాలిలో 50 అడుగుల గణేశుడు.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

