నల్లగొండ : బతుకమ్మ పండుగను తెలంగాణ ఆడబిడ్డలు సంతోషంగా జరుపుకోవాలనే బీఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మ చీరెలన పంపిణీ చేస్తుందని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి(MLA Chirumurthy) లింగయ్య అన్నారు. గురువారం నకిరేకల్ పట్టణంలో రూ. 4.64 కోట్లతో కాలంవారి కుంట మినీ ట్యాంక్ బండ్ పై ప్రహరీ నిర్మాణానికి, రూ.20 లక్షలతో నిర్మించనున్న పంచాయతీ రాజ్ ఉపకార్య నిర్వహణ భవన నిర్మాణానికి శంకుస్థాన చేశారు.
అలాగే చిట్యాల మండలం వనిపాకల గ్రామంలో రూ.10 లక్షలతో సీసీ రోడ్ నిర్మాణ పనులకు, రూ. 10 లక్షలతో నిర్మించనున్న బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం మహిళలకు బతుకమ్మ చీరెలు, క్రీడాకారులకు కేసీఆర్ స్పోర్ట్స్ కిట్స్‌ను అందజేశారు.