సోమవారం 13 జూలై 2020
Telangana - Apr 17, 2020 , 09:06:17

కరోనా వేళ.. ఎమ్మెల్యే గణేశ్‌గుప్తా ఔదార్యం

కరోనా వేళ.. ఎమ్మెల్యే గణేశ్‌గుప్తా ఔదార్యం

  • నగరంలో కీలక శాఖల సిబ్బందికి ఎమ్మెల్యే నిత్యాన్నదానం 
  • పారిశుద్ధ్య కార్మికులకు సన్మానాలతో కొత్త ఉత్సాహం 
  • నేడు అర్బన్‌ ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా ఆయన సేవలు కొనియాడుతున్న జనం 

మంచి మనసున్న మనిషి.. నిరాడంబరుడు.. పిలిస్తే పలికే నేత.. నేనున్నాంటూ ఆపత్కాలంలో అందరికీ భరోసాగా నిలిచే నాయకుడు. రాజకీయాల్లో తనదైన ముద్రవేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్తా కరోనా కఠిన సమయం వేళ తన దాతృత్వాన్ని చూపారు. కష్ట సమయంలో ప్రాణాలొడ్డి పనిచేస్తున్న కీలకశాఖల సిబ్బందికి మధ్యాహ్న భోజనం అందిస్తూ లాక్‌డౌన్‌ కొనసాగుతున్నంతా కాలం ఇదే విధంగా వారి కడుపు నింపుతానని శపథం పూనారు. ఏప్రిల్‌ 1 నుంచి నిరాంటకంగా ఈ నిత్యాన్నదానం కొనసాగుతున్నది. 

రోజుకో వెరైటీ కూరలు వండిస్తూ, ఓ బిస్లరీ వాటర్‌ బాటిల్‌, ఓ బిస్కెట్‌ ప్యాకెట్‌ను అందిస్తూ నిత్యం రెండు వేల మంది ఆకలి తీరుస్తూ అన్నార్థులకు నేనున్నాననే భరోసానిస్తున్నారు. లాక్‌డౌన్‌ ముగిసే వరకు ఇదే విధంగా నిత్యాన్నదానం కొనసాగనుంది. రెవెన్యూ, పోలీసు, పారిశుద్ధ్య కార్మికులు, ఆశవర్కర్లు, వైద్యులు.. ఇలా ప్రజాసేవలో మమేకమై వారిని కాపాడేందుకు అహర్నిశలు కష్టపడుతున్న క్రమంలో వారికి నిత్యం మధ్యాహ్న భోజనాన్ని అర్బన్‌ ఎమ్మెల్యే సమకూరుస్తున్నారు. ఈ విపత్తు వేళ నగరాన్ని నిత్యం శుభ్రంగా ఉంచేందుకు కష్టపడుతున్న పారిశుద్ధ్య కార్మికులు, రోగులకు సేవలందిస్తూ వారికి కొత్త ప్రాణం పోస్తున్న ఆశవర్కర్లు, వైద్య సిబ్బందికి బిగాల పిలుపు మేరకు టీఆర్‌ఎస్‌ శ్రేణులు వారిని ఘనంగా సన్మానించి సంఘీభావం ప్రకటించాయి. 


వారి సేవలను కొనియాడుతూ పుష్పాభిషేకం చేశారు. నిరంతరం తమ ప్రాణాలను సైతం అడ్టుపెట్టి ప్రజల ప్రాణాలను రక్షించేందుకు నడుంబిగించిన యావత్‌ జిల్లా యంత్రాంగానికి, అధికార బృందానికి ఆయన నగర నడిబొడ్డున సెల్యూట్‌ చేసి తన సంఘీభావాన్ని ప్రకటించారు. ఈ విపత్కర పరిస్థితుల్లో తన సహాయ, సహకారాలు ఉంటాయని ప్రకటించారు. గతంలో మహిళా దినోత్సవం సందర్భంగా ఆశవర్కర్లు చేస్తున్న సేవలను గుర్తిస్తూ ఆశవర్కర్లకు, అంగన్‌వాడీ టీచర్లకు పట్టుచీరలు బహూకరించి వారిని సన్మానించి నేనున్నాననే భరోసా కల్పించారు. ఏ విపత్తు వచ్చినా అండగా ఉంటూ అధికార యంత్రాంగానికి తన మద్దతు ప్రకటిస్తున్నారు. 

అన్నీ ప్రభుత్వమే చేయదని, స్వచ్ఛందంగా తమవంతు పాత్ర పోషించాలని పౌర సమాజానికి పిలుపునిస్తూ పార్టీ శ్రేణుల వెన్నుతట్టి కష్టకాలంలో మేముసైతం అంటూ ప్రజాసేవలో మమేకమవుతున్నారు బిగాల. నేడు (శుక్రవారం) అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్తా జన్మదినం సందర్భంగా తమకు అండగా నిలుస్తూ.. అన్నగా అభయాన్నిస్తున్న ఎమ్మెల్యే సేవలను గుర్తు చేసుకుంటున్నారు. తన జన్మదినం సందర్భంగా ఎలాంటి ఆర్భాటలకు పోకుండా ప్రజాసేవలో మమేకం కావాలని, తోచిన సహాయం చేయాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. విపత్తు వేళ ఆడం బరాలు వద్దని , మానవతా హృదయంతో జిల్లా యంత్రాంగానికి  తనవంతు సహాయాన్ని అందించడంతో పాటు కష్టకాలంలో ప్రజలకు అండగా నిలబడాలని కోరారు. logo