యాదగిరిగుట్ట, మే 22 : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అనుచిత వ్యాఖ్యలు చేయడంపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. గురువారం యాదాద్ర భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్టలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య ఆధ్వర్యంలో బీర్ల అయిలయ్య దిష్టిబొమ్మను దహనం చేశాయి.
అంతకుముందు నాయకులు, కార్యకర్తలు కలిసి పట్ణణంలో బీర్ల దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు. ప్రధాన రహదారిపై రెండు గంటలపాటు రాస్తారోకో చేశారు. కేటీఆర్‌కు వెంటనే క్షమాపణలు చెప్పాలని, లేకపోతే అయిలయ్యను ఎక్కడిక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు. యాదగిరిగుట్ట సీఐ భాస్కర్, ఎస్ఐ ఉదయ్ అక్కడికి చేరుకుని బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేశారు.