ఆదిలాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లా పర్యటన సందర్భంగా పోలీసులు అరెస్టు చేసిన ఆదిలాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రి జోగు రామన్న (Jogu Ramanna ) ను బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్( MLA Anil Jadhav ) శుక్రవారం పరామర్శించారు.
రైతుల పక్షాన పోరాడుతున్న జోగు రామన్న గొంతునొక్కడానికే అక్రమ అరెస్టులు చేస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. సీఎం పర్యటనను అడ్డుకుంటామని పిలుపునిచ్చిన మాజీ మంత్రి జోగు రామన్నను పోలీసులు అర్థరాత్రి అక్రమంగా ముందస్తు హౌస్ అరెస్టు చేయడంతో ఇంటికి వెళ్లి జోగు రామన్నతో మాట్లాడారు.
రైతుల కొరకు కొట్లాడుతున్న ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అక్రమంగా హౌస్ అరెస్టులు చేయడం సరికాదని పేర్కొన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రశ్నిస్తే అరెస్ట్ చేయడం సిగ్గు చేటన్నారు.