వెల్గటూర్, ఫిబ్రవరి 19 : రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ గాయపడ్డారు. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం అంబారిపేట శివారులోని మూల మలుపువద్ద జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున ప్రమాదవశాత్తు కారు బోల్తా కొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో లక్ష్మణ్‌కుమార్ ఛాతీ భాగానికి, ఎడమకాలికి గాయాలయ్యాయి. కారులో డ్రైవర్, ఇద్దరు గన్మెన్లు స్వల్పంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, కాంగ్రెస్ నాయకులు అక్కడికు చేరుకొని వారిని కరీంనగర్ అపోలో దవాఖానలో చేర్పించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం లక్ష్మణ్‌కుమార్‌ను హైదరాబాద్ యశోద దవాఖానకు తరలించారు. లక్ష్మణ్‌కుమార్‌కు ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి ఫోన్ చేసి పరామర్శించారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకొన్నారు. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను కోరారు