హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ) : విజిలెన్స్ అంటే తప్పులను పట్టుకోవడం కాదని, వాటిని నివారించడమని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కమిషనర్ ఎంజీ గోపాల్ అన్నారు. సోమవారం బీఆర్కేభవన్లో విజిలెన్స్ అవగాహన వారోత్సవాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు.
నవంబర్ 2వరకు ఈ అవగాహన వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పౌరులు ఫిర్యాదులు చేయడానికి టోల్-ఫ్రీ హెల్ప్‌లైన్ (144321) ప్రారంభించినట్టు వెల్లడించారు. డీజీ శిఖాగోయల్ మాట్లాడుతూ.. ప్రజాసేవలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపుదలకు విజిలెన్స్ కృషి చేస్తున్నట్టు చెప్పారు. అనంతరం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ లోగో, టోల్‌ఫ్రీ నంబర్, పోస్టర్లను ఆవిష్కరించారు.