హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే సహించేది లేదని మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ హెచ్చరించారు. సంబంధిత అధికారులపై శాఖాపరమైన చర్యలు తప్పవని తేల్చిచెప్పారు. పెండింగ్ పనులను సత్వరమే పూర్తి చేయాలని ఆదేశించారు. మైనార్టీ కార్పొరేషన్ జిల్లా అధికారులతో హైదరాబాద్ హజ్‌భవన్‌లో బుధవారం ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు జిల్లాల అధికారులపై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మైనార్టీ కార్పొరేషన్‌కు ప్రభుత్వం నిధులు మంజూరు చేసినప్పటికీ అభివృద్ధి పనులు చేపట్టకపోవడం, కొన్ని జిల్లాల్లో టెండర్లు కూడా పిలకపోవడంపై అసహనం వ్యక్తంచేశారు. మైనార్టీ కార్పొరేషన్ నిర్వహిస్తున్న రెసిడెన్షియల్ హాస్టళ్లను తనిఖీ చేయాలని జిల్లా మైనా ర్టీ కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు. పనుల పురోగతిపై ప్రతినెల సమీక్షించాలని, మూడు నెలలకు ఒకసారి రాష్ట్రస్థాయిలో సమీక్షిస్తామని చెప్పారు. సమావేశంలో మై నార్టీ కార్పొరేషన్ చైర్మన్ మహమ్మద్ ఇంతియాజ్, ముఖ్యకార్యదర్శి అహ్మద్ నదీమ్, వక్ఫ్ బోర్డు చైర్మన్ మహ్మద్ మసిఉల్లా ఖాన్, హజ్ కమిటీ చైర్మన్ సలీం, ఉర్దూ అకాడమీ చైర్మన్‌గా ఖాజా ముజీబుద్దీన్ పాల్గొన్నారు.