వికారాబాద్, ఆగస్టు 7 : వికారాబాద్ శివారెడ్డిపేట పరిధిలోని మైనార్టీ రెసిడెన్షియల్ స్కూలును వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్‌జైన్ గురువారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. భవనంలోని డార్మెంటరీ, భోజనశాల, తరగతి గదులను పరిశీలించారు. వర్షాలతో భవన లీకేజీలను చూసి విద్యార్థుల సౌకర్యార్థం కావలసిన మరమ్మతు పనులను చేపట్టేందుకు చర్యలు చేపట్టాలని పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉమేశ్‌కు సూచించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థుల యోగక్షేమాలు, వారికి కావలసిన అవసరాలను అడిగి తెలుసుకున్నారు. ఆకస్మిక పర్యటనలో జిల్లా అదనపు కలెక్టర్ సుధీర్, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ హర్ష్‌చౌదరి, డీఎండబ్ల్యూవో రాజేశ్వరి, ప్రిన్సిపాల్ ప్రకాశ్ ఉన్నారు.