హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ) : బీజేపీ మైనార్టీ మోర్చా సోషల్ మీడియా విభాగం మహిళా కన్వీనర్ రిదా ఖుద్దూస్ మంగళవారం కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఆమెతో పాటు సోషల్ మీడియా కో కన్వీనర్ మహ్మద్ బిస్ అలీ గుత్మి కూడా బీఆర్ఎస్లో చేరారు. వారికి కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం రిదా ఖుద్దూస్ మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో మైనార్టీల కోసం అమలైన అభివృద్ధి, సంక్షేమ పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో పూర్తిగా నిలిచిపోయాయని వాపోయారు.
దీంతో మైనార్టీల అభివృద్ధి కుంటుపడిందని ఆవేదన వ్యక్తంచేశారు. మైనార్టీలకు నిజమైన అభివృద్ధి జరగాలంటే మళ్లీ కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. మైనార్టీలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలన్న ఏకైక లక్ష్యంతో తాము బీఆర్ఎస్లో చేరుతున్నట్టు ప్రకటించారు. పార్టీ అభివృద్ధి లక్ష్యంగా పని చేసేందుకు బీఆర్ఎస్లో చేరిన రిదా ఖుద్దూస్, మహ్మద్ బిస్ అలీ గుత్మికి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.