దోమ,నవంబర్ 1: వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం దోమ పోలీసు స్టేషన్ పరిధిలోని గుండాల గ్రామంలో ఓ బాలికపై ఐదుగురు లైంగికదాడి చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుండాల గ్రామానికి చెందిన ఓ బాలిక గ్రామంలోని పాఠశాలలో చదువుతున్నది. అదే గ్రామంలో చదువు మానేసిన యువకులు ఆ అమ్మాయితో పరిచయం పెంచుకున్నారు.
అక్టోబర్ 28న బాలికపై లైంగికదాడికి పాల్పడ్డారు. విషయం బాలిక తల్లిదండ్రులకు తెలియడంతో దోమ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో ఐదుగురిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాలికకు వైద్య పరీక్షలు చేయించారు. నిందితులను న్యాయస్థానంలో ప్రవేశపట్టినట్టు ఎస్ఐ ఆనంద్‌కుమార్ తెలిపారు.