హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ) : ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దసరా సెలవుల్లో స్వల్ప మార్పులు చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 24న ఆప్షనల్ హాలిడే బదులు సాధారణ సెలవుగా మార్పు చేసింది. 24న విజయదశమి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకొన్నది. దీంతో ఈ నెల 23, 24న సాధారణ సెలవులు ఉండనున్నాయి.