ఆదివారం 17 జనవరి 2021
Telangana - Dec 24, 2020 , 14:58:31

సబ్‌స్టేషన్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి

సబ్‌స్టేషన్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి

సూర్యాపేట : కేసీఆర్ సీఎం కాకముందు తెలంగాణలో కరంట్ పరిస్థితి ఆగమ్యగోచరంగా ఉండేది. కరంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో  ఎవ్వరికి తెలిసేది కాదు. సీఎం కేసీఆర్ సంకల్పం, అంకుటిత దీక్షతో నేడు తెలంగాణలో  24 గంటల కరంట్ వస్తుందని విద్యుత్‌ శాఖ మంత్రి జగదీష్‌ రెడ్డి అన్నారు. గురువారం తుంగతుర్తి నియోజకవర్గంలోని నాగారం మండల కేంద్రంలో 133/33kv సబ్‌స్టేషన్ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు.

ఈసందర్భంగా జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో రైతుల వరి పొలాలు పొట్టదశలో ఉన్నప్పుడు కరంట్ లేక ఎండిపోయేవన్నారు. నేడు తెలంగాణలో 24 గంటల  కరంట్ అన్ని రంగాలకు అందిస్తున్నామని పేర్కొన్నారు. రాజకీయ వైషమ్యాలకు  నిలయమైన తుంగతుర్తి నియోజకవర్గం నేడు కాళేశ్వరం గోదావరి జలాలతో సస్యశ్యామలం అయిందన్నారు. జిల్లాలో ఎక్కడ చూసిన గోదావరి గలగలలు వినిపిస్తున్నవి.


రైతులు బిజీగా వ్యవసాయ పనుల్లో నిమగ్నం అయ్యారు. తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందిదని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీ లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే కిషోర్, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు రజాక్..ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్ రావు, టీఎస్‌పీడీసీఎల్‌ సీఎండీ రఘురామ రెడ్డి పాల్గొన్నారు.