మంత్రి వివేక్ పీఏ అక్రమాలకు అడ్డే లేదు
మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గంలో మంత్రి వివేక్ అండదండలతో.. ఆయన పీఏ రమణారావు అక్రమాలకు అడ్డూఅదుపులేకుండా పోయిందని, ఈ విషయం స్వయంగా కాంగ్రెస్ నాయకులే చెప్తున్నారని మాజీ విప్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గంలోని జైపూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన రైతుసదస్సులో ఆయన మాట్లాడారు.
- కాంగ్రెస్ నాయకులే ఈ విషయాన్ని స్వయంగా చెప్తున్నరు
- ఇదంతా మంత్రి వివేక్‌కు కన్పిస్తలేదా?
- మాజీ విప్ బాల్క సుమన్
జైపూర్, సెప్టెంబర్ 3 : మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గంలో మంత్రి వివేక్ అండదండలతో.. ఆయన పీఏ రమణారావు అక్రమాలకు అడ్డూఅదుపులేకుండా పోయిందని, ఈ విషయం స్వయంగా కాంగ్రెస్ నాయకులే చెప్తున్నారని మాజీ విప్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గంలోని జైపూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన రైతుసదస్సులో ఆయన మాట్లాడారు.
‘నాడు బీఆర్ఎస్ హయాంలో 9 ఇసుక క్వారీలు ఉన్నయ్.. అవే ఇసుక క్వారీలు ఇప్పుడూ నడుస్తున్నయ్ కదా? మరీ మీరేం చేస్తున్నరు? బీఆర్ఎస్ దిగిపోయి వెయ్యి రోజులు గడుస్తున్నా.. ఇసుక క్వారీలు మీకు కన్పిస్తలేవా? ఎందుకు బంద్ జేస్తలేరు? గుడ్డి గుర్రాల పండ్లు తోముతున్నరా?’ అని ప్రశ్నించారు. ‘మంత్రి పీఏ రమణారావు దుకాణం బెట్టి నెలకు రూ.25 లక్షల మేర వసూళ్లకు పాల్పడుతుండు. ఈ మాటలు నేనంటలేను. కాంగ్రెస్ వాళ్లే చెప్పి పంపిస్తుండ్రు. మొత్తం పీఏనే వేసుకపోతుండు.. మాకేం ఉంటలేవు’ అని అంటున్నరు. ఇది మంత్రి వివేక్‌కు కనిపిస్తలేదా?’ అని ప్రశ్నించారు.
నియోజకవర్గ యువతకు 40 వేల ఉద్యోగాలిప్పిస్తామని.. ఇప్పుడు జర్మనీ, జపాన్ భాషలు నేర్చుకోవాలని యువతకు మార్గనిర్దేశం చేస్తున్నారని సర్కార్‌పై మండిపడ్డారు. 40 వేల ఉద్యోగాల హామీ ఏమైందని ప్రశ్నించారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఈ రెండున్నరేండ్లు మంత్రి పదవికోసం పాకులాడారే తప్ప.. నియోజకవర్గ అభివృద్ధికోసం ఎలాంటి శ్రద్ధ చూపలేదని మంత్రి వివేక్‌పై మండిపడ్డారు. ఇక్కడ ఎమ్మెల్యేగా ఎంపీగా, గెలిచిన వివేక్ ఇతర రాష్ర్టాల్లో ఇతర దేశాల్లో కంపెనీలు పెట్టొచ్చు గాని.. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఓ కంపెనీ పెట్టి నిరుద్యోగులకు ఎందుకు ఉద్యోగాలు కల్పించడం లేదని ప్రశ్నించారు. ఇక కాంగ్రెస్ కథ ముగిసిందని, రాబోయేది కేసీఆర్ సర్కారేనని అన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

