హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ) : బనకచర్లపై ఎక్కడైనా మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నామని మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టంచేశారు. బుధవారం గాంధీభవన్‌లో ప్రజలతో ముఖాముఖి కార్యక్రమానికి మంత్రి వాకిటి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే వారం కృష్ణా జలాలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్(పీపీటీ) ఉంటుందని చెప్పారు. బీజేపీ బీసీలపై పక్షపాత వైఖరి చూపిస్తున్నదని విమర్శించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షపదవి విషయంలో ఆ పార్టీ వైఖరి మరోసారి స్పష్టమైందని తెలిపారు.