హైదరాబాద్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ): వానకాలం సీజన్లో 230 మంది రైతుల నుంచి రూ.3.34 కోట్ల విలువైన 1,449 టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. మొత్తం 7,248 కొనుగోలు కేంద్రాకు గాను 2,539 కేంద్రాలు ప్రారంభించినట్టు చెప్పారు. బుధవారం ధాన్యం కొనుగోళ్లపై ఉమ్మడి నిజామాబాద్ ప్రజా ప్రతినిధులతో హైదరాబాద్‌లోని సివిల్‌సైప్లె భవన్లో ఉత్తమ్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు వివరాలు వెల్లడించారు. ధాన్యంపై క్యాబినెట్ సబ్ కమిటీ నివేదిక సిద్ధమైంది. గురువారం జరగననున్న క్యాబినెట్ సమావేశంలో చర్చించి, కీలక నిర్ణయాలు తీసుకుంటాం. ఈ సీజన్లో 60.73 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా 146.70 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుంది. ఇందులో సుమారు 80 లక్షల టన్నులు కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇందులో 30 లక్షల టన్నులు దొడ్డు రకం కాగా 50 లక్షలు టన్నుల సన్నాలే అని మంత్రి తెలిపారు.