హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం ఉదయం బీఆర్కే భవన్‌లోని మార్కెటింగ్‌శాఖ ప్రధాన కార్యాలయంలో ఆకస్మికంగా తనిఖీ చేశారు.
కార్యాలయం మొత్తం కలియతిరిగి, ఉద్యోగుల హాజరును పరిశీలించారు. 21 మంది ఉద్యోగులు ఆలస్యంగా వచ్చినట్టు గుర్తించారు. సదరు ఉద్యోగులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆలస్యంగా వచ్చిన ఉద్యోగులకు మెమో జారీ చేసి, వివరణ తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. అన్ని కార్యాలయాల్లో ఫేస్ రికగ్నైజేషన్ హాజరు విధానాన్ని అమలు చేయాలని సూచించారు.