హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, ప్రభుత్వం ‘గ్రామ గ్రామాన నాణ్యమైన విత్తనం’ కార్యక్రమం విజయవంతంగా ముగిసిందని వ్యవసాయశాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటివరకు సుమారు 2,500 క్వింటాళ్ల మూల విత్తనాన్ని 35వేల మంది అభ్యుదయ రైతులకు పంపిణీ చేసినట్టు వెల్లడించారు. విత్తనాన్ని అందుకున్న రైతులు, యాజమాన్య పద్ధతులు పాటించి వచ్చిన దిగుబడిని గ్రామంలోని ఇతర రైతులకు పంపిణీ చేయాలని సూచించారు.