హైదరాబాద్, మే 5 (నమస్తేతెలంగాణ): మామిడికాయలు త్వరగా పక్వానికి రావడానికి కార్బైడ్‌ను వాడకుండా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం మారెటింగ్ శాఖ డైరెక్టర్ సురేంద్రమోహన్‌తో మంత్రి ఫోన్లో మాట్లాడారు. మంత్రి తుమ్మల ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ డిప్యూటీ డైరెక్టర్ ప్రసాద్‌రావు, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ రాజేశ్వరి, మారెటింగ్ అధికారులతో కలిసి జాంబాగ్, బాటసింగారం పండ్ల మారెట్లలో తనిఖీలు చేపట్టారు. ఎథోఫోన్, ఎథిలిన్ రసాయనాలను వాడుతున్నట్టు గుర్తించి సీజ్ చేసినట్టు అధికారులు తెలిపారు.
ఈ సారి 12.46 లక్షల మందికే.. ; మధ్యాహ్న భోజనం పథకానికి కేంద్రం అనుమతి
హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ) : సర్కారు బడుల్లోని విద్యార్థులకు అందజేసే మధ్యాహ్న భోజన పథకం రాష్ట్రంలోని 12,46,598 మంది విద్యార్థులకు వర్తింపజేయనున్నారు. 2025-26 విద్యాసంవత్సరానికి 25,901 పాఠశాలల్లో కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. పీఎం పోషణ్ ప్రాజెక్ట్ అప్రూవల్బోర్డు (పీఏబీ) మినట్స్‌ను కేంద్రం తాజాగా విడుదల చేసింది. 17,712 ప్రాథమిక బడుల్లో 7,88,724 మంది విద్యార్థులు, 8,189 ప్రాథమికోన్నత బడుల్లోని 4,57,874 మందికి మధ్యాహ్న భోజనం సమకూర్చేందుకు ఆమోదం తెలిపింది. 1-8 తరగతుల విద్యార్థులకు రూ.307 కోట్లకు కేంద్ర వాటా రూ.192కోట్లు కాగా, రూ. 115 కోట్లుగా ఖరారుచేసింది.