Runa Mafi | ఐటీ రిటర్న్ పొందినవారికీ రుణమాఫీ : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
Runa Mafi | ఆదాయం పన్ను చెల్లించి, వాటిని తిరిగి పొందినవారు కూడా రైతు రుణమాఫీకి అర్హులేనని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టంచేశారు.
Runa Mafi | హైదరాబాద్, జూలై 16(నమస్తే తెలంగాణ): ఆదాయం పన్ను చెల్లించి, వాటిని తిరిగి పొందినవారు కూడా రైతు రుణమాఫీకి అర్హులేనని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టంచేశారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారికి, సివిల్ సర్వీసెస్, పెద్దవాళ్లకు మాత్రం రుణమాఫీ లేదని చెప్పారు. కుటుంబాన్ని గుర్తించేందుకు మాత్రమే రేషన్‌కార్డు వినియోగిస్తామని, పాస్ పుస్తకం ఆధారంగానే రుణమాఫీ చేస్తామని తెలిపారు. కానీ, కొంతమంది రేషన్‌కార్డు ఆధారంగానే రుణమాఫీ చేస్తున్నారంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
గత ప్రభుత్వం చేసిన విధంగానే రుణమాఫీ చేస్తున్నామని తెలిపారు. మంగళవారం ఆయన సచివాలయంలో మీడియాతో చిట్‌చాట్ చేశారు. ఇచ్చినమాట ప్రకారం ఆగస్టు 15లోపు రైతు కుటుంబానికి రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు. గురువారం రూ.లక్ష వరకు గల రుణాలను మాఫీ చేస్తామని తెలిపారు. ఆ రోజు సాయంత్రం 4 గంటలకు 11.50 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేస్తామని వెల్లడించారు.
ఈ సందర్భంగా రైతువేదికల్లో సంబురాలు నిర్వహిస్తామని, ఈ వేడుకల్లో రైతులందరూ పాల్గొనాలని ఆహ్వానించారు. మిగిలిన మొత్తాన్ని అతి త్వరలోనే పూర్తి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. ప్రతి కుటుంబానికి రూ.2 లక్షలు మాత్రమే రుణమాఫీ చేస్తామని స్పష్టంచేశారు. కుటుంబానికి రూ.2 లక్షలకు మించి రుణం ఉంటే.. ఆ మొత్తాన్ని ముందుగానే రైతులు బ్యాంకులకు చెల్లించాలని, ఆ తర్వాతే రైతుల ఖాతాల్లో రూ.2 లక్షల రుణమాఫీ డబ్బులను ప్రభుత్వం జమ చేస్తుందని తేల్చిచెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

