Minister Thummala | రద్దీ ఎక్కువ ఉన్నచోట టీములను పెంచి.. ప్రతి దరఖాస్తును స్వీకరించాలి : మంత్రి తుమ్మల
Minister Thummala | ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు నిర్వహించనున్న‘ప్రజాపాలన’ కార్యక్రమాన్ని బాధ్యతగా నిర్వహించి ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చాలని, ప్రతి ఒక్కరి దరఖాస్తు స్వీకరించాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Thummala) అధికారులకు సూచించారు.
నల్లగొండ : ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు నిర్వహించనున్న‘ప్రజాపాలన’ కార్యక్రమాన్ని బాధ్యతగా నిర్వహించి ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చాలని, ప్రతి ఒక్కరి దరఖాస్తు స్వీకరించాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Thummala) అధికారులకు సూచించారు. మంగళవారం నల్గొండ(Nalgonda) పట్టణంలోని ఎంఎన్ఆర్ కన్వెన్షన్ హాలులో ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులతో ప్రజాపాలన( Praja palana )కార్యక్రమం ముందస్తు సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి ఆయన సన్నాహక సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ..పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆరు గ్యారెంటీల పథకాల అమలు కోసం రాష్ట్ర మంత్రివర్గం, జిల్లా కలెక్టర్లతో సమావేశమై దిశా నిర్దేశం చేశారని పేర్కొన్నారు. ఈనెల 28వ తేదీ నుంచి వచ్చే నెల 6 వ తేదీ వరకు నిర్వహించే ప్రజాపాలన కార్యక్రమంలో ప్రణాళిక బద్ధంగా దరఖాస్తులు స్వీకరించాలన్నారు. అందుకోసం ఏర్పాట్లు పక్కాగా ఉండాలని, ఎక్కడా ఎలాంటి సంఘటన జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. రద్దీ ఎక్కువ ఉన్నచోట టీములను పెంచాలని, అందరూ సమన్వయంతో విజయవంతంగా పూర్తి చేయాలన్నారు.
సన్నాహక సమావేశంలో ప్రభుత విప్ బీర్ల ఐలయ్య,, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు బాలునాయక్, వేముల వీరేశం, నల్లమాద పద్మావతి, బి.లక్ష్మా రెడ్డి, కె. జయవీర్ రెడ్డి, మందుల సామెల్, నల్గొండ జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతు కే. జెండగే, సూర్యాపేట ఇంచార్జి కలెక్టర్ సీహెచ్. ప్రియాంక, నల్గొండ ఎస్.పి. అపూర్వ రావు, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

