Sitarama project | సీతారామ ప్రాజెక్టు కాలువ పనులను వేగవంతం చేయాలి : మంత్రి తుమ్మల
Sitarama project | సీతారామ ప్రాజెక్టు(Sitarama project) కాలువల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Thummala) అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్ : సీతారామ ప్రాజెక్టు(Sitarama project) కాలువల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Thummala) అధికారులను ఆదేశించారు. నాణ్యతా ప్రమాణాల్లో ఎక్కడా రాజీ పడవద్దని సూచిం చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలంలో మంగళవారం పర్యటించిన ఆయన.. గుంపెన గ్రామ శివారులో జాతీయ రహదారిపై నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్టు కాలువ వంతెన, కాలువ నిర్మాణ పనుల ను భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో కలిసి పరిశీలించారు.
ప్రాజెక్టు కాలువ నిర్మాణ పనుల పురోగతి గురించి అధికారులను అడిగి తెలుసుకొన్నారు. అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. సీతారామ ప్రాజెక్టు కాలువ నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలను పాటించాలని సూచించారు. పనులను వేగవంతంగా చేప ట్టేలా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కాలువ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయా లని సూచించారు. ఈ కార్యక్రమంలో సీతారామ ప్రాజెక్టు సీఈ ఏ.శ్రీనివాస్‌రెడ్డి, ఎస్ఈ ఎస్.శ్రీనివాస్‌రెడ్డి, ఈఈ అర్జున్, డీఈఈ భాస్కర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

