TS Assembly | రాష్ట్రంలో భారీ ఎత్తున చేపల పెంపకం : మంత్రి తలసాని
TS Assembly | శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా చేపల పెంపకానికి ప్రోత్సాహంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమాధానం ఇచ్చారు.

హైదరాబాద్ : శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా చేపల పెంపకానికి ప్రోత్సాహంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమాధానం ఇచ్చారు.
రాష్ట్రంలో భారీ ఎత్తున చేపల పెంపకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది అని తెలిపారు. చేపల ఉత్పత్తిని పెంచడానికి, మత్స్యకారుల జీవనోపాధిని పెంచడానికి 100 శాతం గ్రాంట్‌తో చేప, రొయ్య పిల్లలను పంపిణీ చేస్తున్నాము. 2021-22 ఏడాదికి 28,704 నీటి వనరులలో 93 కోట్ల చేప పిల్లలను, ఎంపిక చేసిన 200 నీటి వనరుల్లో 10 కోట్ల రొయ్య పిల్లలను నిల్వ చేయాలని ప్రతిపాదించాం. 81 రిజర్వాయర్లు, 1348 శాశ్వత చెరువులు, 27,275 వానాకాలం చెరువుల్లో చేపలను వదులుతున్నామని తెలిపారు. మత్స్యకారులకు బీమా సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పారు.
సమైక్యాంధ్రలో మత్స్యకారులు నిర్లక్ష్యానికి గురయ్యారు. బడ్జెట్లో కూడా మత్స్యకారులకు నిధులు కేటాయించలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో వివిధ వర్గాలను ఆదుకునేందుకు ఉపాధి కల్పించడం జరిగిందన్నారు. అందులో భాగంగా మత్స్యకారులకు చేప పిల్లలను పంపిణీ చేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

