మహబూబ్‌నగర్‌టౌన్/అర్బన్/పాలమూ రు, ఆగస్టు 29: పతకాలు సాధిస్తే క్రీడాకారులకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావడంతోపాటు దేశానికి పేరుప్రతిష్ఠలు వస్తాయని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం జిల్లా క్రీడా శాఖ ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్‌లోని గ్రామర్ స్కూల్లో ‘చలో మైదాన్’ నిర్వహించారు. ముందుగా మేజర్ ధ్యాన్‌చంద్ చిత్రపటానికి నివాళులర్పించారు.
మంత్రి మాట్లాడుతూ.. క్రీడాకారులకు తెలంగాణ సర్కారు ప్రో త్సాహం అందించడంతోనే కామన్వెల్త్ క్రీడ ల్లో రాష్ట్రం రెండోస్థానంలో నిలిచిందని తెలిపారు. యువత క్రీడల్లోనూ రాణించాలని కోరారు. త్వరలో క్రీడా పాలసీని అమలు చేస్తామని పేర్కొన్నారు. అనంతరం వాలీబాల్, బాస్కెట్‌బాల్, అథ్లెటిక్స్, అర్చరీ విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.