హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు హైకోర్టులో ఊరట లభించింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకున్నారంటూ 2017లో పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్ పోలీస్ స్టేషన్లో ఆయనపై నమోదైన కేసును హైకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.