హైదరాబాద్, డిసెంబర్ 7 (నమ స్తే తెలంగాణ): మహిళా సంఘాల ఉత్పత్తుల విక్రయాలకు అవకాశం కల్పిస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తెలిపారు.
బేగంపేటలోని హరితప్లాజాలో తెలంగాణ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇం డస్ట్రీ ఏర్పాటు చేసిన మహిళా యువ వ్యాపారవేత్తల ప్రోత్సాహక ప్రదర్శన లో మంత్రి పాల్గొని మాట్లాడారు. అతివలు వ్యాపారవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు.