హైదరాబాద్, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): తమది ఉద్యోగుల సంక్షేమ సర్కార్ అని మంత్రి సీతక్క అన్నారు. మహాత్మాజ్యోతిబా పూలే ప్రజాభవన్‌లో శనివారం పంచాయతీ సెక్రటరీస్ సెంట్రల్ ఫోరం డైరీ, క్యాలెండర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు.
ప్రభుత్వ ఉద్యోగులందరికీ హెల్త్‌కార్డులు ఇస్తామని చెప్పా రు. జీవో 317 కారణంగా స్థానికత కో ల్పోయి దూర ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న 223 మంది పంచాయతీ కార్యదర్శులకు రెండేండ్లపాటు అంతర్ జిల్లా డిప్యుటేషన్‌పై నియామకానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్టు తెలిపారు. కార్యక్రమంలో టీఎన్జీవో అధ్యక్షుడు మారం జగదీశ్వర్, జనరల్ సెక్రటరీ ఎస్ఎం హుస్సేనీ ముజీబ్, టీపీఎస్ఈఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ బలరాం తదితరులు పాల్గొన్నారు.
న్యాయ దేవత రూపం మహిళదే అయినప్పటికీ న్యాయ వ్యవస్థలో మహిళల భాగస్వామ్యం ఇంకా తకువగానే ఉన్నదని మంత్రి సీతక్క ఆవేదన వ్యక్తంచేశారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్యభవన్‌లో శనివారం ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమెన్ అడ్వకేట్స్ కాన్వొకేషన్-2026 కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడారు.