హైదరాబాద్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి కోసం కేటాయించిన నిధులను ఎమ్మెల్యేలు ఇతర అవసరాలకు కోసం మళ్లించవద్దని మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క సూచించారు. బుధవారం మాసబ్‌ట్యాంక్‌లోని దామోదర సంజీవయ్య సంక్షేమభవన్‌లో ఎస్టీ ఎమ్మెల్యేలతో మంత్రి సమావేశం నిర్వహించారు. గిరిజన పాఠశాలలు, వసతి గృహాల్లో భవనాల నిర్మాణం, మౌలిక సదుపాయాల కోసం రూ.250 కోట్లు కేటాయిస్తున్నట్టు తెలిపారు. ఈ నెల 15న గిరిజన పాఠశాలలు, తండాల్లో సేవాలాల్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్టు చెప్పారు. ఉత్సవాల కోసం ప్రభుత్వం రూ.2 కోట్లు కేటాయించిందని తెలిపారు. కార్యక్రమంలో ట్రైకార్ చైర్మన్ బెల్లయ్యనాయక్, ఎమ్మెల్యేలు కోవా లక్ష్మి, అనిల్ జాదవ్, విప్ రామచంద్రనాయక్, మురళీనాయక్, రామదాస్నాయక్, వెద్మా బొజ్జు, జాలే ఆదినారాయణ, కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, ఎంపీ బలరాం నాయక్, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి శరత్, అధికారులు పాల్గొన్నారు.